భవిష్యత్ అంతా ఆంగ్లభాషదే భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి

Published: Friday April 01, 2022
మధిర మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో గురువారంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వచ్చే విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరికీ ఆంగ్లభాషా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర మండలంలోని మధిర హరిజనవాడ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆంగ్ల మాధ్యమ శిక్షణ తరగతులకు భరత్ విద్యాసంస్థల అధినేత శ్రీ శీలం వెంకట రెడ్డి విచ్చేసి ఆంగ్ల భాషలోనే మెలకువలను శిక్షకులకు నేర్పించారు. భవిష్యత్ అంతా ఆంగ్లభాషదే కావున ప్రతి ఒక్కరూ ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకున్నట్లయితే సులువుగా ఆంగ్ల భాష విద్యార్థులకు అందించవచ్చని సూచించారు. అనంతరం కోర్స్ డైరెక్టర్ మధిర మండల విద్యాశాఖ అధికారులు శ్రీ వై ప్రభాకర్ మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నటువంటి వెంకటరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కోసం సమయాన్ని కేటాయించడమే కాక ఆంగ్ల భాషలోని మెళకువలను అందించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరిజనవాడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని విజయశ్రీతో పాటు గణిత బోధన మెంటార్స్ ఏ వి ఆర్, సుధాకర్, గండూరి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.