SFI నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం* *ప్రశ్నిస్తారనే భయంతోనే ముందే అరెస్టులా...?* *విద్యా

Published: Friday July 29, 2022
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కరించకుండా ముందస్తు అరెస్టులు చేయడం దారుణం అన్నారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించటంలో ప్రభుత్వ వైఫల్యం చెందింది.జిల్లాలో 5 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏర్పడి ఏండ్లు గడుస్తున్న సొంత భవనాలను నోచుకోలేదు అన్నారు. శిలాఫలకంపై కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో  భవనాలు నిర్మించటంలో నిర్లక్ష్యం కావాలని ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని అన్నారు. జిల్లా నుంచి విద్యా శాఖ మంత్రి ఉండి విద్యలో వెనుకబాటు తనమే ఉందన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు .ముందస్తు అరెస్టుల మీద ఉన్న శ్రద్ధప్రభుత్వ విద్యా రంగం మీద పట్టాలని సూచించారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో మంత్రి గారిని జిల్లాలో అడ్డుకుంటామని హెచ్చరించారూ.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పి జగన్ ఉపాధ్యక్షులు మస్కు చరణ్ , ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష కార్యదర్శులు తరంగ్ శ్రీకాంత్  పాల్గొన్నారు. 
 
 
 
Attachments area