స్వేరోస్ ఫెలోషిప్ దరఖాస్తుల ఆహ్వానం శంకరపట్నం ఫిబ్రవరి 21ప్రజాపాలన రిపోర్టర్:

Published: Wednesday February 22, 2023

పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశ్యంతో స్వేరోస్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు స్వేరోస్ ఇంటర్నేషనల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాతంగి మారుతి మంగళవారము ఒక ప్రకటనలో తెలియజేసారు. అందులో భాగంగానే  డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు స్వేరోస్ సంస్థ చేయూత అందించటానికి నిరూపేద విద్యార్ధులకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అందిస్తున్న గొప్ప అవకాశాన్ని, శంకరపట్నం మండలం లో ఉన్నత విద్య ను అభ్యసించే విద్యార్థులు విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని వారుకొరారు.
అప్లికేషన్ ,పూర్తి వివరాలకు స్వేరోస్ వెబ్సైట్ ను సందర్శించలానీ, పూర్తి సమాచారం కొరకు 9866096139  సంప్రదించలానీ వారు తెలియజేసారు.