మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి సేవలు వెలకట్టలేనివి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి

Published: Monday October 03, 2022

కోరుట్ల, అక్టోబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన నాయకులలో అగ్రగణ్యుడు. ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారని. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు అని. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలుగా ధరించి ఎన్నో పోరాటాలు చేసి భారత స్వాతంత్ర్య సంగ్రామ ముఖ చిత్రంగా మహాత్మ గాంధీ  అయ్యారని మరియు లాల్ బహదూర్ శాస్త్రి
భారత దేశ రెండవ ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించారని , శాస్త్రి గారు భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి అని, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడని. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడని. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడని 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడని అన్నారు.ఈ నివాళి కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పేరుమండ్ల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కోరుట్ల మండలం కాంగ్రెస్ అద్యక్షులు కొంతం రాజం, యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం అద్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుపాకుల భాజన్,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నయీం, మండలం ఉపాధ్యక్షులు ముహమ్మద్ నబీ,కోరుట్ల పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల కృష్ణా ప్రసాద్,పట్టణ కాంగ్రెస్ సెక్రటరి దండవెని వెంకట్, పట్టణ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ ఎంభేరి సత్య నారాయణ,కాంగ్రెస్ నాయకులు హమీద్, ముజ్బీత్, నజ్జూ,కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.