దళిత విద్యార్థులను కుండలో నీళ్లు త్రాగుతే చంపుతరా..?

Published: Thursday August 18, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 17, ప్రజాపాలన : దళిత విద్యార్థులను కుండలో నీళ్లు త్రాగుతే చంపుతరా అని నిరసన తెలుపుతూ మంచిర్యాల జిల్లా సీసీ కార్నర్ లోని  ప్రధాన రోడ్డు పై కులరక్కసి దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డూర్కె మోహన్ మాట్లాడుతూ  రాజస్థాన్ జిల్లా జలోర్ లో గల సునారా గ్రామంలో విద్య శిశు మందిర్ అనే ప్రైవేట్ పాఠశాలలో   చదువుతున్న ఇంద్ర మెగ్వాల్ అనే దళిత విద్యార్థి దాహంతో కుండలో నీళ్లు త్రాగినందుకు జులై 20న అగ్రవర్ణాలకు చెందిన ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో చెవిలో , తలకు బలమైన గాయం కావడంతో దాదాపు 25 రోజులు చికిత్స పొందుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన  రోజున తుది శ్వాస విడిచాడు. ఇంత జరిగినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళిత విద్యార్థులకు, పేద ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు.రాజస్థాన్ లో అగ్రవర్ణాల ఉపాధ్యాయుని చేతిలో చనిపోయిన ఇందిరా మెగ్వాల్  కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయలను, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిని పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చించారు. 
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి రాజకుమార్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అభినవ్, నాయకులు సాయి, సంజయ్, బన్నీ, రాములు, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area