రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన బూసిరెడ్డి శంకర్ రెడ్డి. భద్రాద

Published: Thursday October 06, 2022
తెలంగాణ రాష్ట్ర మరియు గుంటూరు ప్రకాశం జిల్లాల కేంద్ర కార్యాలయాన్ని రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3150 గవర్నర్ డా.భూసిరెడ్డి శంకర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.
2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర మరియు గుంటూరు ప్రకాశం జిల్లాల గవర్నర్ గా తన విధులను భద్రాచలం కేంద్రంగా నిర్వహిస్తానని డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డా.భూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలియజేశారు. అందులో భాగంగానే పరమ పవిత్రమైన విజయదశమి రోజున తన కార్యాలయాన్ని భద్రాచలంలో ప్రారంభించినట్టు డా.భూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలియజేశారు.
ఏజెన్సీ ప్రాంతమైన అవిభాజ్య ఖమ్మం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ముఖ్యంగా, ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని డాక్టర్ భూసిరెడ్డి శంకర్ రెడ్డి తెలియజేశారు.
రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3150 కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్) పండి తాన్సేన్ దంపతులతో పాటు రోటరీ జిల్లా డైరెక్టర్ చైర్మన్ మహమ్మద్ రఫీ, రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ అధ్యక్షులు బూసిరెడ్డి నాగార్జున రెడ్డి దంపతులు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట కార్యాలయ కార్యదర్శి సంపత్ గంజి, పూర్వ అధ్యక్షులు మోతుకూరి వీరయ్య, బూసిరెడ్డి శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా భద్రాచలం రోటరీ నాయకులు సభ్యులు సానికొమ్ము బ్రహ్మారెడ్డి, కోట మధుసూధన రావు, ప్రభాకర్ గుప్తా, బెల్లంకొండ రమేష్, చలపతిరావు, విద్యాసాగర్, బందు నర్సింహారావు, సానికొమ్ము శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు