విలేకరి ని దూసించడం దుర్మాగమైన చర్య

Published: Tuesday March 30, 2021

- వారిని  వెంటనే అరెస్టు చేయాలి.
- అధికారులు స్పందించకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  ఆందోళన.
- అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు సిటీ మాల్ల భరత్ కుమార్.నేత కానీ సంగం మండల అధ్యక్షుడు లక్ష్మణ్.

జన్నారం, మార్చి29, ప్రజాపాలన ప్రతినిధి : భారత రాజ్యాంగానికి నాలుగో స్తంభం గా నిలిచిన పత్రికారంగంలో పనిచేస్తున్న ( ప్రశ్నించే గొంతుక) విలేకరులకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ కరువైందని జన్నారం మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సిటీ మల భరత్ కుమార్ నేతకాని సంఘం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వృత్తిరీత్యా ఫోటో సేకరించుకుని వచ్చిన మంచిర్యాల జిల్లా కు చెందిన ప్రజా పాలన బ్యూరో ఇంచార్జ్ వెంకటస్వామి పై జన్నారం మండలానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన సభ్యులు ఫోన్ చేసి చంపుతా అంటూ అసబ్య పదజాలంతో మాట్లాడారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను బెదిరించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. అదేవిధంగా అయనను అసభ్యకర పదాలతో దూషించడం బాధాకరమని దీనిని జన్నారం ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి లను అరెస్టు చేసి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పత్రికా విలేఖరిగా ప్రజల సమస్యల కోసం వెళ్లడం వార్త సేకరించడం అది ప్రతి విలేకరి ఒక వృత్తి ధర్మం అని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో భౌతిక దాడులకు దిగడం, ఫోన్లలో బెదిరింపులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని లేని ఎడల ఉమ్మడి జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ జిల్లా నాయకులు, బోర్లకుంట ప్రభుదాస్, తల్లపెళ్ళి రాజేశ్వర్, మామిడి పెళ్లి ఇండయ్య, పాత బాలరాజు, దుర్గం అమృత్ రావు, నందయ్య, విజయ్, కుందా శ్రీనివాస్, తల్లపెళ్ళి, గంగన్న, సుధాకర్, తదితరులు