నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలి

Published: Wednesday November 30, 2022
 చేవెళ్ల నియోజకవర్గం: (ప్రజా పాలన):
చేవెళ్ల మండల కేంద్రంలో రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్  పిలుపుమేరకు చేవెళ్ల మండల తాసిల్దార్ కార్యాలయంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు..
ఈ సందర్భంగా...... మాట్లాడుతూ..... యువకులు నిరుద్యోగులు పోరాడి  సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరగ లేదు ఉద్యోగ నియామకాలు లేక రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇస్తానని  హామీ ఇవ్వడం జరిగింది కానీ వాటిని ఇప్పటివరకు  రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు ఉద్యోగ నియామాలు చేపడతామంటూ నోటిఫికేషన్ల ను జారీ చేసి దాదాపు సంవత్సరం అవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం నియామకం జరగలేదు.నియామకాల జాప్యం వల్ల నిరుద్యోగులు విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో ప్రవేటు హాస్టల్లో ఫీజులు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ భృతి ఒక్కరికి 3016×48,=144768 ఇవ్వాలని కోరుతున్నాం లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి భాస్కర్,ఉపాధ్యక్షుడు కృష్ణమోహన్,అంజన్ యాదవ్,టౌన్ ప్రెసిడెంట్ బండారి శేఖర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి, రవీందర్,రామకృష్ణ,రంజిత్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు