కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Published: Tuesday October 19, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి : ఆల్ ఇండియా కిసాన్ సభ పిలుపుమేరకు తెలంగాణ రైతు సంఘం యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ ఖేరి లో రైతులను చంపిన  కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి గారు హాజరై మాట్లాడుతూ లఖీ౦పూర్ ఖేరిలో రైతులను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం నుంచి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 11 నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయకుండా రైతుల పై లాఠీఛార్జ్లు, భౌతిక దాడులు చేయాలని కేంద్ర మంత్రులు, హర్యానా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం మరుసటి రోజు శాంతియుతంగా రైతుఉద్యమం ఉద్యమం చేస్తున్న రైతులపై కారు తో గుద్ధి రైతులను చంపిన ఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేసి తనకు తన కుమారుడు అశిష్ మిశ్ర లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు లేనిపక్షంలో రైతులను చైతన్యపరిచి రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు ఎం చంద్రయ్య, రైతు సంఘం నాయకులు సర్పంచులు బాషయ్య, పెద్దయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చందు నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, పి ఎన్ ఎం జిల్లా అధ్యక్షులు వినోద్ కుమార్, ఉప సర్పంచ్ లు రమేష్, జగన్, నాయకులు ఎంపీ నరసింహ, ఆంజనేయులు, రాములు, యాదయ్య, నరసింహ, సంజీవ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.