మండలంలోని గ్రామాలలో కిరాణా షాపులలో మద్యం అమ్మకం

Published: Tuesday December 20, 2022
జన్నారం, డిసెంబర్ 19, ప్రజాపాలన:  మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారని ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిపల్లి ఇందయ్య అన్నారు. సోమవారం మండలంలోని గ్రామలలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని 29 గ్రామపంచాయతీలు 34 గ్రామాలలో ప్రతి కిరణ షాపు బెల్ట్ షాప్ గా మారిందన్నారు. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో పాఠశాలలకు, దేవాలయాలకు కనీసం వంద మీటర్ల దూరం కూడా లేకుండా బెల్ట్ షాపులు నడపడం విడురంగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు  దేవాలయాలకు  దగ్గరకు కిరాణా దుకాణాల్లో మద్యం బాటిళ్లు అమ్ముతున్నారని, మద్యం బాటిళ్లు బెల్ట్ షాపు దగ్గర కోని, గ్రామంలో కిరాణా షాపుల్లో విక్రయిస్తుదన్నారు. ఇలాంటి వాటిపై అధికారులు అవగాహన సదస్సులు జరిపి గ్రామాల్లో అనుమతి లేని కిరాణా షాపులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్ని చట్టాలు వచ్చిన ఇలాంటి వాటిని అరికట్టాడంలో అధికారులు విపలమవుతుదన్నారు. పోలిస్ మండల అధికార యంత్రాంగం  స్పందించి కనీసం పాఠశాల, దేవుని గూడి దగ్గర వున్న కిరాణా షాపుల్లో బెల్టు షాపులు జరుగకుండ చూసి అమ్మే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేస్తున్నారు.