ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి * చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 192 వ జయంతి

Published: Wednesday January 04, 2023

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ప్రజాసంఘాల కన్వీనర్ కాడిగళ్ల. భాస్కర్ , తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి  పాల్గొని మాట్లాడుతూ,
మహారాష్ట్రలో పిశ్వల రాజ్యo అనంతరం బ్రిటిష్ పాలన సాగుతున్న కాలంలో అంటరానితనం అస్పర్శత బాల్య వివాహాలు శూద్రులపై హత్యలు అఘాయిత్యాలు దారుణాలు సాగుతున్న కాలంలో సావిత్రిబాయి పూలే తన భర్త అయినా మహాత్మ జ్యోతిరావు పూలే  సహకారంతో అంటరాని వారికి అనాధలకు మహిళలకు చదువు నిషేధం ఉన్న కాలంలో చదువుకుంటే ప్రాణాలు తృణప్రాయంగా తెగ నరికే కాలంలో చదువులు చెప్పాలని దృడ నిశ్చయంతో చిన్నచిన్న పాఠశాలలు ప్రారంభించి చదువులు చెబుతున్న సందర్భంగా అగ్రకుల మనవాదులు అంటరాని వారికి పాఠాలు చెపుతావా అంటూ అనేకమైన మానసిక హింసలకు గురిచేస్తూ ఆమె ఉదయం చదువు చెప్పటానికి పాఠశాలకు వెళుతున్న సందర్భంగా ఆమె పైన బురద నీళ్లు ఇంటి ముందు వేసే శాంపి నీళ్లు తనపై చల్లేవారు అలాగే సూటిపోటు మాటలు అనేటివారు కొన్ని సందర్భాలలో భౌతికంగా కూడా దాడులు చేశారన్నారు, ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా తన భర్త సహకారంతో ఎన్నో పాఠశాలలు ప్రారంభించి మహారాష్ట్ర లో అనేక పట్టణాల్లో నగరాల్లో ఉదయం రాత్రిపూట చదువు చెప్పేవారు,
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సావిత్రిబాయి పూలే   పేరు భారత దేశ చరిత్రలో నిలబడిందని చెప్పారు,
ఈ దేశంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే  జీవిత చరిత్రను అధ్యయనం చేసి వెలికి తీసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు, ఈ దేశంలో అక్షర జ్ఞానం అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పిల్లలను కూడా కనకుండా కుటుంబ భవిష్యత్తును కూడా ఆలోచించకుండా అట్టడుగు వర్గాల విద్యార్థులే తమ పిల్లలుగా భావించి వేలాది పాఠశాలలను తెరిపించి ఉచిత విద్యను అందించిన మహానీయుల చరిత్ర కనుమరుగు కాకుండా చరిత్ర పుటల్లోకి వారి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు,
భారత ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా తీసుకురావాలని అలాగే ఈ దేశ మొట్టమొదటి మహిళా టీచర్ గా గుర్తించి నోబెల్ బహుమతి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు, రానున్న కాలంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి గుర్తించే వరకు పోరాడుతామన్నారు,
ఈ కార్యక్రమంలో డి. రామచందర్, బి.మసుదన్ రెడ్డి, ఏ.వెంకటేష్, ఎం.రామకృష్ణారెడ్డి,
సిహెచ్.ముసలయ్య, కే. శ్రీనివాస్ రెడ్డి,
ఎం.ఆనంద్, వై. జగన్, కే.జంగారెడ్డి, ఎంపీ నరసింహ, ఎం. భాషయ్య సర్పంచ్ ధర్మన్నగూడెం, తావు నాయక్, చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు,