జిల్లా నూతన కలెక్టర్ నారాయణరెడ్డికి శుభాకాంక్షలు

Published: Saturday February 04, 2023
* బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపామని వికారాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దావల్ గారి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయుటకు శాయశక్తులా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ధారూర్ మండలానికి చెందిన బిఆర్ఎస్ ప్రజానిధులు జిల్లా నూతన కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ధారూర్ మండల మాజీ అధ్యక్షులు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాములు తరిగోపుల గ్రామ సర్పంచ్ కోస్నం వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ్ రవికుమార్ యువ నాయకులు జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు