కేర్చిపలికి రద్దయిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరణ చేయాలి.సిపిఎం డిమాండ్

Published: Monday July 12, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని కెర్చిపల్లి గ్రామంలో నైట్ హాల్ట్ చేసే బస్సు రద్దు కావడంతో గ్రామ ప్రజలు,ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నైట్ హల్ట్ బస్సును పునరుద్ధరణ చేయాలని, గ్రామానికి లింక్ రోడ్లుగా ఉన్న కేర్చిపల్లి నుండి మొగిలిపాక వరకు అదే విధంగా కేర్చుపల్లి నుండి సుంకిషాల వరకు కేర్చిపల్లి కదిరేనిగూడం వరకు గల రోడ్లు బురదతో గ్రామనికి చెందిన పంట పొలలోకి వెళ్లే రైతులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఈ మూడు గ్రామాల లింకు రోడ్లను బిటి రోడ్డుగా మార్చాలని సిపిఎం మండల కార్యదర్శి మద్దెల రాజయ్య, జిల్లా కమిటీ సభ్యుడు సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు.శనివారం రాత్రి కేర్చిపల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ 6 మహాసభ దయ్యాల సత్యరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు లింకు రోడ్ల సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే ప్రభుత్వం లింకు రోడ్ల సమస్యలు పరిష్కారం చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని, అదే విధంగా గతంలో గ్రామానికి నైట్ హల్ట్ బస్సు వచ్చేదని, ఈ మధ్యకాలంలో ఆది నిలిచిపోయిందని దాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో. భువనగిరి నుంచి వలిగొండ నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిలిచిపోయిన బస్సును పునరుద్ధరణ చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో అనేక వార్డుల్లో కనీసం సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని, వెంటనే ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకుని వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కందాడి సత్తిరెడ్డి, డివైఎఫ్ఐ మండల నాయకులు కవిడే సురేష్, లు పాల్గోని మాట్లాడగా అనంతరం గ్రామ శాఖ నూతన కార్యదర్శిగా దయ్యాల సహాయ కార్యదర్శిగా లోడే మల్లేశం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సిపిఎం గ్రామ శాఖ నాయకులు. కందగట్ల సాయి రెడ్డి, దయ్యాల మల్లేశం, కలుకూరి రామచంద్రం, కలుకురి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు