పలుఅభివృద్ధి పనుల గురించి కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ లత మధిర అక్టోబర

Published: Thursday October 27, 2022
బుధవారం నాడుమున్సిపాలిటీ పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ గౌతమ్ కి పలు అభివృద్ధి పనుల కొరకు వినతి పత్రం సమర్పించారు, అందుకు కలెక్టర్  సానుకులముగా స్పందించడం జరిగింది.మున్సిపాలిటీ పరిధిలో 30 ఏళ్లు గా సొంతం గా తమకు తోచిన పనైనా బడ్డీకోట్లు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ జీవనం పొందుతున్నారు, మధిర పట్టణంలో బడ్డికోట్లని అమ్ముకొని చాలామంది పొందుతున్నారు, బడ్డీకొట్లను తొలగించడం వలన వారి బతుకులు భారంగా అవుతున్నాయి. మధిర పట్టణంలో తొలగించిన బడ్డీకోట్ల వారికి నష్టం జరగకుండా వారి జీవితాలను దృష్టిలో పెట్టుకొని వారి పక్షాన నిలబడి ప్రత్యామ్నాయంగా మరొకచోట ఏర్పాటు చేసుకొనుటకు అనుమతి,మున్సిపాలిటీ పరిధిలోని 1 నుంచి 22 వార్డులలో మిషన్ భగీరథ పైప్ లైన్ల పనులు జరుగుచున్నవి, పైప్ లైన్ కొరకు తీసిన గుంతలు పునరుద్ధరణ త్వరితగతిన పూర్తి చేయించగలరని మున్సిపాలిటీ సుమారు 35 వేల జనాభా కలిగిన పట్టణము కానీ జనాభా కు తగినట్లుగా పట్టణ స్థితికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవు మున్సిపాలిటీ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కొరకు మధిర మున్సిపాలిటీ ప్రజలు కోరుచున్నారు కావున మున్సిపాలిటీ నిధులు అయినటువంటి ఎల్ఆర్ఎస్ ఫండ్ ద్వారా పారిశుద్ధ ప్రయోజనం కొరకు ప్రధాన అంతర్గత రహదారుల అభివృద్ధి మరియు డ్రెయిన్లు నిర్మాణం కు అనుమతి ఇవ్వగలరని, ఇలా పలు అభివృద్ధి పనుల కొరకు  కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు స్పందించి వెంటనే పనులు వేగవంతం చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి  మున్సిపల్ చైర్మన్ లత ఏఈ నరేష్ రెడ్డి డిప్యూటీీ తహసిల్దార్ ఆర్డీవో రవీందర్ నాథ్ అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు