దళిత బంధు పై కాంగ్రెస్ నాయకులు చేసేది తప్పుడు ప్రచారం. టిఆర్ఎస్ మధిర అక్టోబర్ 10 ప్రజా పాలన ప్

Published: Tuesday October 11, 2022
అవునా కదా అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి అనవసర తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ సహించబోము. దళిత బంధు ఇచ్చేది మేమే కాంగ్రెస్ లో చేరండి అంటూ తప్పుడు ప్రచారం చేసే కాంగ్రెస్ నాయకుల బ్రోకర్ మాటలు నమ్మొద్దు.దళిత బంధు పై కాంగ్రెస్ నాయకులు చేసేది తప్పుడు ప్రచారం అని దానిని ఎవరూ నమ్మొద్దని టీ.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు,  నాయకులు తెలిపారు ఈ సందర్భంగావారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దళితుల అభ్యున్నతికి ఏ నాయకుడు ఆలోచన చేయని విధంగా  కేసీఆర్ ఆలోచన చేసి దళిత కుటుంబాలకు ఆర్దిక భరోసా కల్పించి వారి అభ్యున్నతికి మార్గం చూపించాలని దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు ఇప్పటికే అది విజయవంతంగా అమలు జరుగుతోందని తెలిపారు దళిత బంధు తీసుకువచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం
ఇచ్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారని స్పష్టం చేశారు మధిర నియోజకవర్గంలో చింతకాని మండలంలో ఇప్పటికే అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు అందిందని వాటితో ఏర్పాటు చేసుకున్న వ్యాపారాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలు పెట్టుకొని సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు కానీ దళిత బంధు పథకం విజయవంతంగా సాగుతుందని తమ ఉనికిని కోల్పోతున్నామని భయపడి కాంగ్రెస్ నాయకులు దళిత బంధు అమలు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు దళిత బంధు ఇచ్చేది తమ నాయకుడు భట్టి అని కాంగ్రెస్ పార్టీలో చేరితే దళిత బంధు ఇప్పిస్తాం అంటూ తప్పడు ప్రచారాలు చేయడం పనికిమాలిన చర్య అన్నారు మధిర నియోజకవర్గంలో అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు వస్తుందన్నారు నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ద్వారా జరుగుతోందని ఎవరు కంగారు పడవద్దని స్పష్టం చేశారు కంగారు పడి కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. దళిత బంధు పథకం తెచ్చింది ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం అవునా కదా అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు
సమావేశంలో ఎంపీపీ మెండెం లలిత, మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు , పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ , కనకపూడి పెద్ద బుచ్చయ్య   నాయకులు మేడికొండ కిరణ్ మెండెం వెంకయ్య ఎర్రగుంట రమేష్  నండ్రు తిమోతి, బుర్రి బాబు, గూగులోతు కృష్ణ  తదితరులు ఉన్నారు