వ్యవసాయ శాఖ వారికి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం మధిర రూరల్

Published: Friday February 03, 2023
 ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు మండలం లోని మధిర,మల్లారం, మాటూరు,సిరిపురం,ఖమ్మంపాడు,రాయపట్నం దెందుకూరు క్లస్టర్ పరిధి లో వ్యవసాయ శాఖ ఏఈఓ లు  పి ఎస్ పి మరియు వరి వేదజల్లే పద్ధతి పై రైతులకు అవగాహన  కలిపించడం జరుగుతుంది.
పి ఎస్ బి అనగా బాస్వరాన్ని కరిగించే బాక్టీరియా. ఇది భూమిలో లభ్యంకాని రూపం లో ఉన్న  బాస్వరాన్ని ఈ బాక్టీరియా జాతులు లభ్యరూపంలోకి మార్చి మొక్కకు అందిస్తాయిబాస్వరాన్ని కరిగించే బాక్టీరియా ఒక ప్యాకెట్ వాడితే, హెక్టార్ కు  కట్ట డి ఎ పి వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు. ఉందిది800 ను అన్ని పంటలకు వినియోగించవచ్చు .ఈ జీవన ఎరువులను రెండు పద్ధతులొ వినియోగించవచ్చు. పశువుల ఎరువుతో గాని  వర్మికాంపోస్ట్ లో కలిపి నేల పై జల్లడం విత్తన శుద్ది చేయడం
వెదజల్లే పద్ధతి: ఇటీవల కాలంలో నాట్లు ఖర్చు ఎక్కువగా అవడం వలన ఈ పద్ధతిలో పంటలు సాగు చేస్తే తక్కువ ఖర్చు తో ఎక్కువలాభం పొందవచ్చు అవగాహన కలిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు