రాజీనామా చేసిన వారి నుండే ఎన్నికల ఖర్చులను వసూలు చేయాలి ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసిన క

Published: Saturday August 27, 2022
బెల్లంపల్లి ఆగస్టు 26 ప్రజా పాలన ప్రతినిధి:  స్వంత లాభాలకోసం  కావాలని రాజీనామాలు చేస్తూ, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, ఆ ఎన్నికలకు అయ్యే ఖర్చును వారిని నుండే వసూలు చేసి ఎన్నికలు నిర్వహించాలని,   తెలంగాణ పద్మశాలి  సొసైటీ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ ఎన్నికల ప్రధాన అధికారికి పంపిన విజ్ఞాపన పత్రంలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
   మునుగోడు మాజీ ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి నుంచి   ఎన్నికలకు నిర్వహణకు అయ్యే   ప్రజాదనాన్ని   నామినేషన్ వేసే సమయం లోనే  డిపాజిట్ రూపేణా వసూలు చేసి    ప్రజా దనము  దుర్వినియోగాన్ని అరికట్టాలని అన్నారు.
 2023డిసెంబర్ వరకు    గల ఎమ్మెల్యే పదవికాలాన్ని తన వ్యకి గత లాభం కోసం,  రాజకీయ ప్రాబల్యం కోసం, చేసే రాజీనామాలను   ఎన్నికలకమిషనర్ అనుమతించవద్దని,    నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటూ   రాజీనామాలు చేస్తూ, ప్రజలు కష్టపడి  కడుతున్న పన్నులతో  ఎమ్మెల్యే, ఎంపీలు, జీతాలు పొందుతూ  ప్రభుత్వాలను నడిపిస్తుంటే ,  ఓట్ వేసిన ప్రజలకు   మాత్రం  ప్రభుత్వపథకాలు   లభించకుండా   వారి వారి వ్యక్తి గత లాభం కోసం    ప్రజలసొమ్ము తో  రాజభోగాలు అనుభవిస్తున్నారని అన్నారు.
    మునుగోడు శాసనసభ నియోజకవర్గం నకు ఆయ్యే ఖర్చు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి వసూల్ చేసి ఎన్నిక జరపించాలని ఆయన డిమాండ్ చేశారు.