విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం ఈనెల 17న నిరసన దీక్ష ..టిడిపి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యద

Published: Tuesday November 15, 2022

జన్నారం, నవంబర్ 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో 132 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందని  తెలుగుదేశం పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి రాజేశ్వర్ అన్నారు. సోమవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు, రైతులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం నాణ్యత లేక మండల ప్రజలు అనేక రకాలుగా విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్నా రన్నారు. రైతులకు పండించే పంటలకు సరైన సమయంలో నీరు అందక లో వోల్టేజ్ విద్యుత్ సరఫరాతో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని, వ్యాపారస్తులు విద్యుత్ సమస్య వల్ల తమ వ్యాపారాలను నడుపుకోలేక ఫ్యాన్లు, ఫ్రిజ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు నష్టపోతున్నామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, మీసేవ కేంద్రాలలో, ఆన్ లైన్  సేవలు, అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సమస్యలు తీరాలంటే మండల కేంద్రంలో 132 కెవి విద్యుత్ సబ్స్టేషన్  అవసరమని అన్నారు. కావున ఈనెల 17 న విద్యుత్ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు  కొరకు చేపడుతున్న నిరసన దీక్షకు సంఘీభావంగా మండలంలోని రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు,  వినియోగదారులు, రాజకీయ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుల విజయ్, పార్లమెంట్  నాయకులు పులిశెట్టి శ్రీనివాస్, బట్టల నర్సగౌడ్ రైతు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.