2 లక్షల రూపాయల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే...

Published: Monday June 07, 2021
జగిత్యాల, జాన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొంది ఆర్థికంగా నష్టపోయాడు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలువగా వైద్యఖర్చుల బిల్లులను సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయగా మంజూరైన 2 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అతని ఇంటివద్ద లబ్దిదారునికి అందజేయగా సంతోషం వ్యక్తంచేశారు. లబ్ధిదారుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ చెక్కుద్వారా ఆర్థికంగా కొంత ఊరట లభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.