అంబేద్కర్ విగ్రహవిష్కరణ

Published: Wednesday September 29, 2021
హైదరాబాదు 28 సెప్టెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: పాటిమట్లలో వెలసిన బహుజనుల ఆరాధ్య దైవం అంబేద్కర్. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగిందన్నారు. తదుపరి చిరుమూర్తి యాదయ్య అద్యక్షతన సమావేశం నిర్వహించారన్నారు. అంతకు ముందు ఆట పాటలతో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్స్ లు చేస్తూ మహిళా మణులు కోలాటం ఆడుతూ పెద్ద ఎత్తున గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ప్రొఫెసర్ ఖాసీంకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఖాసీం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అంబేద్కర్ విగ్రహదాత అయిన కురుమేటి నవీణ్ ను ప్రజలందరు కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు సభాధ్యక్షుడు చిరుమూర్తి యాదయ్య పేరు పేరునా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం జరిపామని తెలిపారు.