అత్వెల్లిలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు

Published: Saturday April 15, 2023
 అత్వెల్లి గ్రామ సర్పంచ్ మోహన్
వికారాబాద్ బ్యూరో 14 ఏప్రిల్ ప్రజా పాలన : భిన్న సంస్కృతులు విభిన్న భాషలతో విరాజిల్లేందుకు దార్శనిక రాజ్యాంగాన్ని అందజేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కు మనమందరం రుణపడి ఉందామని అత్వెల్లి గ్రామ సర్పంచ్ మోహన్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని అథ్వెల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోహన్ మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ఆచార వ్యవహారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించే విధంగా రాజ్యాంగాన్ని రచన చేయడం అభినందనీయమని ప్రశంసించారు. అణగారిన ప్రజల ఆశలను నెరవేర్చే ఆశాదీపం బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బండ కిషన్ రెడ్డి, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు తరుణ్ అరుణ్ మల్లికార్జున్ ఎం.రాజు సురేష్ ప్రభాకర్ నర్సిములు రాంచంద్రయ్య దేవయ్య రత్నయ్య సంగమేష్ రవీందర్ సత్తయ్య గ్రామస్థులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.