దేశహితం కోరే బడ్జెట్

Published: Wednesday February 02, 2022
జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి
వికారాబాద్ బ్యూరో 01 ఫిబ్రవరి ప్రజాపాలన : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశహితం కోరే బడ్జెట్ గా ఉందని  వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి అభివర్ణించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ ను అందరూ స్వాగతించాలని కోరారు. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రగతి శీల బడ్జెట్ ను ప్రవేశపెట్టారని అన్నారు. భావితరాలకు ఉపయోగం పడే బడ్జెట్ గా చూడాలని చెప్పారు. పోస్టాఫీసు ద్వారా బ్యాంకు సర్వీసులు నిర్వహణకు ఆమోదం తెలిపడం హర్షణీయమన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టారనే విషయాన్ని గుర్తించాలని కోరారు. పన్నులను పెంచకుండా 5 లక్షల కోట్లకు పైగా అదనపు బడ్జెట్ ప్రవేశ పెట్టడం సాధారణ విషయం కాదని చెప్పారు. సంపన్న దేశంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని అన్నారు. 2.30వేల కోట్లు పంట కొనుగోలు కోసం కేటాయించడంతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రసాయన రహిత పంటలకు పెద్దపీట వేశారని తెలిపారు. యువతను వ్యవసాయం వైపు మళ్ళించేందుకు బడ్జెట్ ఊతమిచ్చిందని చెప్పుకోవచ్చు. తృణధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. నదులు అనుసంధానం కోసం ముసాయిదా డీపీఆర్ లకు ఆమోదం తెలిపడంతో ఐదు నదులు అనుసంధానం అవుతాయని.. వరద ముంపు తప్పుతుందని సదానందరెడ్డి తెలిపారు.