నగరంలో పచ్చదనం పెంచేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు. పంచిన మొక్కలను ప్రజలు నాటి పిల్లల

Published: Thursday July 28, 2022

 

కరీంనగర్ జూలై 26 ప్రజాపాలన :

అంతరించిన అటవి సంపదను పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ను ప్రతిష్ఠాత్మకంగా ప్రజల ముందుకు తెచ్చారని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. 8 వ విడుత హరితహారం లో భాగంగా మంగళవారం రోజు 34 వ డివిజన్ గోదాంగడ్డ లో స్థానిక కార్పోరేటర్ షఖీరా అంజూమ్ బర్గత్ అలీతో కలిసి ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు మేయర్ సునీల్ రావు 3 పండ్లు 3 పూల మొక్కల చొప్పున 6 మొక్కల ను అందించారు. పంపిణీ చేసిన మొక్కలను ఇంటి ఆవరణలో నాటీ పిల్లల వలే సంరక్షించాలని మహిళలను కోరారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ... నగరపాలక సంస్థలో గత 7 విడతల్లో... పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందని తెలిపారు. 8 వ విడుత హరితహారంలో 5 లక్షల మొక్కలు నాటడమే టార్గెట్ గా నిర్ణయించుకొని ఆ దిశగా చర్యలు సాగిస్తున్నామన్నారు. నగర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి... ప్రజలకు స్వచ్చమైన వాతావరణం కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అటవి విస్తీర్ణం పెరిగి... పట్టణాల్లో కూడ పచ్చదనం కూడ పరుచుకుందన్నారు. మొక్కలు మానవ మనుగడకు జీవన ఆధారం కాబట్టి... స్వచ్చమైన గాలిని ఇచ్చే మొక్కలను విరివిగా పెంచాలని పిలుపు నిచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా ఇప్పటికే హరితహారం కింద నగర నాటికలను ఏర్పాటు చేస్తూ... పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ఉన్న స్థలాల అనుకూలతను బట్టి యాదద్రి మియావాకీ, బ్లాక్ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి డివిజన్ కు 4 వేల మొక్కల చొప్పున 2.40 లక్షల మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండ డివిజన్ల వారిగా అవెన్యూ ప్లాంటేషన్, మియావాకీ బ్లాక్ పద్దతిలో మరో 2.60 లక్షల మొక్కల ను నాటడం జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థ పచ్చదనం పెంచడం కోసం ప్రతి సంవత్సరం 10% గ్రీన్ బడ్జెట్ ను కేటాయించి మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థ పరిదిలో 11 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. మహిళలు నగరపాలక సంస్థ పంచే పండ్లు పూల మొక్కలను మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గానీ కుండీలలో గాని నాటి... సంరక్షించాలని పిలుపు నిచ్చారు. అంతే కాకుండా నగరపాలక సంస్థ ద్వారా మీ డివిజన్ వీధుల్లో నాటే మొక్కలను కూడా నీరు పోసి సంరక్షించాలని కోరారు. నగరంలో ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో కూడ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు డెన్ ఫారెస్టు లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం లో మహిళలు బాగస్వాములై పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాతావరణ సమతుల్యత ను కాపాడాలని పిలుపునిచ్చారు. నగరాన్ని హరిత కరీంనగర్ గా మార్చేందుకు మహిళలు, ప్రజలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.కరీంనగర్ జూలై 26 ప్రజాపాలన :