వాగులోనే చెత్తా..!

Published: Monday December 20, 2021
నిరుపయోగంగా డంపింగ్ యార్డ్ షెడ్
జన్నారం రూరల్,  డిసెంబర్ 19, ప్రజాపాలన : లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డంపింగ్ యాడ్ (తడి, పోడి చెత్త నిలువ చేసే షెడ్డు) ను వినియోగంలో తేవడంలో పొన్ కల్ గ్రామపంచాయతీ సిబ్బంది విఫలమయ్యారు, దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోగా షెడ్డు నిరుపయోగంగా మారింది. గ్రామంలో సేకరించిన చెత్తను పక్కన ఉన్న వాగులో పడవేసి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వాగులో ప్రవహించే నీరంతా మురికిగా మారడంతో పశువుల తాగి వ్యాదుల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోపిస్తున్న చిత్తశుద్ది - నీరుగారుతోన్న లక్ష్యం
తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కరువైంది. పోన్కల్ గ్రామ పంచాయతీలో తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌కు తరలించాలనే లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసిన పంచాయతీ లు ఆ తర్వాత పర్యవేక్షణ మరిచింది. తడిచెత్త, పొడి చెత్త రెండూ ఒకే డబ్బాల్లో వేసి పంచాయతీ చెత్త వాహనంకు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చెత్తను ఎక్కడికక్కడే తగ్గించడానికి అమల్లోకి తీసుకొచ్చిన విధానం సత్ఫలితాలివ్వడం లేదు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలు ఇచ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త బండికి ఇవ్వాలని ప్రచారం చేశారు. ట్రాక్టర్ లకు, సైకిల్ రిక్షా ద్వారా కూడా తడి, పొడి వేరు చేసేందుకు వాటికి కూడా డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
ఉన్నతాధికారులు స్పందించాలి.
పొన్కల్ గ్రామ పంచాయతీ సిబ్బంది వాగులో తడి, పోడి చెత్తను పారవేయడం పై జిల్లా కలెక్టర్ స్పందించాలని భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది నిర్వాకం వల్ల వాగులో నీరు కలుసితం అవుఉందని అన్నారు. దింతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా అదికారులు స్పందించకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.