రైతులు నూనె గింజ పంటల సాగుపై దృష్టి సారించాలి కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కో

Published: Wednesday March 01, 2023
 జన్నారం, ఫిబ్రవరి 28, ప్రజాపాలన: రైతులు నూనె గింజల పంటల సాగుపై దృష్టి సారించాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని రేండ్లగూడ గ్రామంలో కొత్తూరు నరసయ్య వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూనె గింజల సాగు రైతుకు లాభదాయంగా ఉంటుందన్నారు. నూనె గింజల సాగు, నూనె అనేది అందరికీ నిత్యవసరమన్నారు. పంట సాగుపై కృషి విజ్ఞాన కేంద్రం సలహాలు సూచనలు పాటించాలన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారుల సహకారం నూనె గింజల సాగు రైతులు తీసుకోవాలన్నారు. ఆధునిక విజ్ఞాని జోడించుకొని వ్యవసాయానికి జోడించుకున్నట్లయితే రైతుకు పంట దిగుబడి ఎక్కువ వస్తుందని రైతు లాభాలలో ఉంటాడని వారు తెలిపారు నూనె గింజల సాగు నూతన పద్ధతుల ద్వారా నూనె గింజల సాగు రైతులు తెలుసుకోవాలని రైతు విజ్ఞాన కేంద్రం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి సస్యరక్షణ శాస్త్రవేత్త శ్రీ. నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి త్రిసంధ్య, అధికారులు, ముల్కల రాజారావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.