ప్రైవేటు టీచర్లకు రాష్ట్రసర్కార్ 25 కిలోల సన్న బియ్యం పంపిణి ప్రారంభించిన అధికారులు

Published: Friday April 23, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ​కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రజలను పట్టి పీడిస్తున్న సందర్భంగా ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్ కు రెండు వేల రూపాయలతో పాటు 25 కేజీల సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా గొల్లపెల్లి మండల కేంద్రంలోని మండల విద్యధికారి కార్యాలయం ఆవరణలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకర్ జెడ్పిటిసి జలంధర్ సింగిల్విండో చైర్మన్లు రాజ సుమన్ రావు జీ.వి మాధవరావు ఏఎమ్సీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి స్థానిక తహీశీల్దార్ నవీన్ కుమార్ ఎంఈఓ జమునదేవి నయాబు తహీశీల్దార్ సుమన్ సివిల్ సప్లయ్ అధికారి రాకేష్ డీలర్ రవీందర్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.