మోటమర్రిలో కరోనా టెస్టులు

Published: Wednesday March 24, 2021
మధిర, మార్చి 23, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణలో మళ్లీ కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా ఈ రోజు బోనకల్ మండలం మోటమర్రి ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణంలో గ్రామ సర్పంచ్ కేతినేని ఇందు ఆధ్వర్యంలో  కోవిడ్ -19 మొబైల్ టెస్టింగ్ వాహనం ద్వారా జిల్లా కో-ఆర్డినేటర్ సుబ్బారావు సమక్షంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది 68 మంది విద్యార్థులకు, 30మంది గ్రామస్తులకు మొత్తం 98 మందికి కరోనా ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహించారు. అందరికి నెగిటివ్ వచ్చాయి. కరోనాను అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరు ‘శానిటైజర్‌.. మాస్క్‌.. భౌతికదూరం’ వంటివి పాటించటం తప్పనిసరి అని వైద్యారోగ్యా శాఖ సిబ్బంది గ్రామస్తులకు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్, ఆశ వర్కర్లు, ఎ. యన్.ఎం, తదితరులు పాల్గొన్నారు.