కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మానవతారాయ్..

Published: Saturday February 25, 2023

కల్లూరు, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన న్యూస్):  కల్లూరు రెండు పడకల ఇళ్ళు   కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ వేగవంతంగా జరపాలని అదేవిధంగా రెండు పడకల ఇళ్ళు నిర్మించిన ప్రక్కనే ఉన్న 30కుంటల ఎన్.ఎస్.పి ప్రభుత్వ స్థలంను ఎమ్మెల్యే సండ్ర అనుచరుల కబ్జా నుండి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు, విలేకరుల కు పంచాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఖమ్మం కలెక్టర్ వి.పి గౌతమ్ కి కల్లూరు ఆర్.డి.వో కార్యాలయం ముందు 3వరోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రెండు పడకల ఇళ్ళ బాదితులతో కలిసి వినతిపత్రం ఇచ్చి పిర్యాదు చేశారు. శుక్రవారం మద్యాహ్నం కలెక్టర్ గౌతమ్ కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నిర్మాణం లో ఉన్న ఇండోర్ క్రీడా మైదానం పరిశీలనకి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న మానవతారాయ్ రిలే నిరాహారదీక్ష చేస్తున్న బాదితులను హుటాహుటిన కలెక్టర్ ఉన్న ఇండో క్రీడా మైదానానికి తీసుకు వచ్చి బాదితుల గోడు కలెక్టర్ గౌతమ్ కి వినిపించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గౌతమ్ 30 కుంటల ఎన్.ఎస్.పి స్థలం కబ్జాపై విచారణ జరుపుతామన్నారు.రిలే నిహారదీక్ష చేస్తున్న నిరుపేద బాదితులకి ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే 3లక్షల పథకాన్ని వర్తింప చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు ఎంపిటీసి దామాల రాజు,షేక్ జానీ పాషా, ఉమామహేశ్వరి, ఉమర్, రమాదేవి, కోటేశ్వరి ఉన్నారు.