కోరుట్ల కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Published: Monday June 20, 2022

కోరుట్ల, జూన్ 19 (ప్రజాపాలన ప్రతినిధి):
కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కోరుట్ల పట్టణంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో  కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతు రాహుల్ గాంధీ  ప్రతి క్షణం, ప్రజల కోసం వేసే  ప్రతి అడుగు శ్రేయస్సు కోసమే అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు .