ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి ఎమ్మెల్సీ కొండబాల

Published: Monday November 29, 2021
మధిర నవంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఆత్కూర్ మామిడితోటలో జరిగిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కళాకారుల వన సామారాధన కార్యక్రమంలో ముందుగా డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం  పురస్కరించుకొని వారం రోజులు పాటు వివిధ జన సమూహంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన నిమిత్తం ఆరోగ్య శాఖలో పని చేసే మధిర ఆశ మిత్ర జానపధ కళాకారుడు లంకా కొండయ్య ఏర్పాటు చేసిన స్టాప్ ఎయిడ్స్ చిత్ర పటాన్ని మధిర రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు శ్రీ పుతుంభాక శ్రీ కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన మాజీ ఎంఎల్ఏ రాష్ట్ర విత్తనఅభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ కొండబాల కోటేశ్వరరావు మల్లాది సేవా సమితి అధ్యక్షులు శ్రీ మల్లాది వాసు శ్రీ సీతా రామాంజనేయ కళా నాట్య మండలి అధ్యక్షులు శ్రీ గడ్డం సుబ్బారావు రామ భక్త సీతయ్య కళా పరిషత్ సెక్రటరీ బాబ్ల లంకా కొండయ్య చేతులు మీదగా ఆవిష్కరణ చేసి కర పత్రాలు విడుదల చేసి నారు. ఈ కర పత్రాలు అవగాహనా ప్రచారం నిమిత్తం కిoడ్లీ kindly స్వచ్చంద్ సంస్థ నిర్వహకులు వి అనూష రెడ్డి కృష్ణా రెడ్డి దంపతులు ముద్రించి ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో వివధా ప్రాంతాలు నుండీ వచ్చిన కళా కారులు సామాజిక సేవకులు పారు పల్లి సురేష్, కురిచేటి సత్యనారాయణ సిలివేరు శాంతయ్య, డా.నిభానుపూడి సుబ్బరాజు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ రోజు ఉదయం స్థానిక టీవిఎం హై స్కూల్ నందు మార్నింగ్ వాక్ లో భాగంగా టీవిఎం వాకర్స్ క్లబ్ సభ్యులకు అవగాహన నిమిత్తం హెచ్ఐవి ఎయిడ్స్ కర పత్రాలు లంకా కొండయ్య చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగింది.