బనిగండ్లపాడు జిల్లా తొలి మంత్రి శీలం సిద్ధారెడ్డి జయంతి వేడుకలు.

Published: Tuesday August 24, 2021
ఎర్రుపాలెం, ఆగష్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా తొలి మంత్రిగా పనిచేసిన శీలం సిద్ధారెడ్డి గారి స్వగ్రామం బనిగండ్లపాడులో సిద్ధారెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ కోఆర్డినేటర్ శీలం వెంకట రెడ్డి. రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడు శీలం చెన్నా రెడ్డి సిద్ధారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రెడ్డి గారి హయాంలో ఈ మధిర నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని. వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగిందని. ముఖ్యంగా కట్టలేరు డ్యాం నిర్మాణం వలన రైతాంగానికి ఎంతో మేలు చేశారని. వారు చేసిన కృషి వల్లనే ఈరోజు ఎరు పాలెం మండలంలో మాగాణి పొలాలకు సక్రమంగా నీళ్లు అందుతున్నాయని కొనియాడారు. స్కూళ్ల నిర్మాణం. పేద విద్యార్థులు చదువుల కోసం అహర్నిశలు తపించే వారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. గూడూరు రమణారెడ్డి. బనిగండ్లపాడు గ్రామ సర్పంచ్. జంగా పుల్లారెడ్డి . సొసైటీ ప్రెసిడెంట్. శీలం అంకిరెడ్డి. మాజీ సొసైటీ అధ్యక్షులు. ఎన్నం సత్యనారాయణ రెడ్డి. సిరి వేరు. వెంకట్ రెడ్డి. రామిరెడ్డి. స్వతంత్ర సమరయోధులు. వెంకటేశ్వరరావు. శ్రీనివాస రావు. అంకల్. తదితరులు పాల్గొన్నారు