ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం : కార్పొరేటర్ హేమలత

Published: Thursday October 28, 2021
హైదరాబాద్ (ప్రజాపాలన సిటీ బ్యూరో) : ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు స్థానిక కార్పొరేటర్ హేమలత. పద్మారావు నగర్ లోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్  హేమలత మరియు టిఆరెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి  గుర్రం పవన్ కుమార్ గౌడ్ పర్యటించారు. ప్రధానంగా సాయిబాబా దేవాలయం వెనకాల బస్తీలో నెలకొన్న డ్రైనేజి సమస్య, తాగునీటి సరఫరాలో మురుగు నీటి సరఫరా లాంటి సమస్యలను స్థానికులు టిఆరెస్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా బస్తీలో వీధి దీపాలు వెలగడం లేదని, స్థానికంగా ఉన్న పార్కుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలకు ఉపయోగించే అవకాశం లేదని వారు తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని పర్యటనలో పాల్గొన్న వాటర్ వర్క్స్ డిజిఎం వెంకట్ కు మరియు హార్టికల్చర్ ఆఫీసర్ రాఘవేంద్రరావుకు కార్పొరేటర్ సూచించారు. ఈ ప్రాంతంలో 8 లక్షల రూపాయలతో డ్రైనేజి పైప్ లైన్ మంజురు అయిందని పనులను శుక్రవారంనాడు ప్రారంభిస్తామని వాటర్ వర్క్స్ అధికారులు వివరించారు. దీనితో కలుషిత నీరు సరఫరా సమస్య పరిష్కారం అవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆరెస్ నాయకులు ఏసురి మహేష్, డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ రాజు, శ్రీకాంత్ రెడ్డి, హరిచరి, సుధాకర్ రెడ్డి, మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ముక్క శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.