ప్రభుత్వ భూములకు పంగనామాలు పెడుతున్న అధికారులు

Published: Wednesday June 23, 2021
జిన్నారం, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది సంబంధిత అధికారుల చేతివాటానికి మండలంలోని పలు ప్రాంతాల్లో కోట్లు గడించే భూములపై కబ్జాకోరులు కన్ను పడింది, అధికారుల చేతివాటంతో కర్తవ్యాన్ని మరిచిపోతున్నారు, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జాదారులు, కబ్జాదారులపై అధికార యంత్రాంగం పని చేస్తుందో లేదో అని సందేహంలో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రజా ప్రతినిధుల అధికారుల అండదండలతో భూ బకాసురులు ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. స్థానికులు అధికారులుకు ఫిర్యాదులు చేసిన చర్యల నమమాత్రానికే పనిచేస్తాయని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు కుంటలు నాలాలు కబ్జాకు గురయ్యాయని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం, మొన్న కిష్టయ్య పల్లి, గడ్డ పోతారం, కాజిపల్లి, నిన్న జిన్నారం తాజాగా మండలంలోని బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కేటాయించిన భూ కబ్జాదారులు కొన్ని సంవత్సరాల లీజ్ పేరుతో అధికారుల చేతి వాటాన్ని సహాయంగా తీసుకుని ఏకంగా తన కుటుంబ సభ్యుల పేరుపై రెగ్యులర్ చేశారు. ఇది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఇంత జరిగినా అధికారులు మాత్రం ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అహర్నిశలు కష్టపడుతున్న మని గొప్పలకు పోతున్నారు కబ్జాకోరులు కొమ్ముకాస్తున్న అధికారులపై కబ్జాకోరులుపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ మున్సిపాలిటీలోని రెండో వార్డు కౌన్సిలర్ వి గోపాలమ్మ వెంకటయ్య బిజెపి నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు టి రవీందర్ రెడ్డి రాఘవేందర్ అన్నారు వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మండలంలో ప్రభుత్వ భూములు పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు