**అంగన్వాడి టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి**

Published: Wednesday February 15, 2023

-రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్*

చేవెళ్ల ఫిబ్రవరి 14, (ప్రజాపాలన):-

చేవెళ్ల నియోజకవర్గం లోని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు అంగన్వాడి టీచర్లు పెద్ద సంఖ్యలో  సి ఐ టీ యు ఆధ్వర్యంలో  బయలుదేరారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్లు ఐసిడిఎస్ లో పనిచేస్తున్నారని వారికి ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం ప్రభుత్వం అమలు చేయడం లేదని ఎన్ హెచ్ టి ఎస్ యాప్ ను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వారి సమస్యలపై చాలామంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించారని కానీ చేవెళ్ల ఎమ్మెల్యే మాత్రం మాట్లాడలేదని తెలిపారు. వారి సమస్యల కోసం ఎవరు కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో వారికి మద్దతు ఇస్తామని తెలియజేశారు. అంగన్వాడి టీచర్ల యూనియన్ నాయకురాళ్లు ఉమా లక్ష్మి స్వప్న ప్రవీణ చంద్రకళ అనిత తదితరులు పాల్గొన్నారు.