ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Thursday April 15, 2021
మధిర, ఏప్రిల్ 14, ప్రజాపాలన ప్రతినిధి : పీడిత తాడిత అణగారిన వర్గాల సూర్యుడు, సువిశాల భారతావనికి దశ దిశ నిర్దేశించిన మార్గదర్శకుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమం చిరు వ్యాపారం సంగంపసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లోఘనంగా నిర్వహించారు. శీనివాసరావు నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో, వర్ణానికో పరిమితం కాదని మనిషిని మనిషిగా చూడబడే మానవీయ సమాజం కొరకు తపించి శ్రమించిన పోరాట యోధుడని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన లౌకిక సర్వసత్తాక ప్రజాస్వామిక భారతదేశ భవిష్యత్తుకు అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్ అని కీర్తించారు. నలభై సంవత్సరాలుగా డాక్టర్ బి.ఆర్ చిరు వ్యాపారంవ్యాపార సంఘంద్వారా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటు అనేక దళిత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుండడం తన జీవితానికి ఎంతో సంతృప్తిని కలిగిస్తోందన్నారు. అంబేద్కర్ నిగౌరవించడమంటే దేశాన్ని గౌరవించినట్లు గా తాను భావిస్తున్నానని ఆజన్మాంతం అంబేద్కర్ ఆశయ సాధనకు దళితుల అభ్యున్నతికి తమ సంఘం కృషి కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు తెలిపారు