ఘనంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

Published: Wednesday November 24, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కాయంజల్ చౌరస్తా లోని అంబెడ్కర్ సెంటర్ లో మంగళవారం రోజు బీఎస్పీ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు తుర్కయంజల్ బీఎస్పీ పార్టీ అధ్యక్షులు వద్దిగల్ల బాబు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు పులామాల వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎడవెల్లి శ్యామ్, కార్యదర్శి బూతం రమణ, కార్యవర్గ సభ్యులు లపంగి రాజు, పట్నం రమేష్, తిప్పర్థి సైదులు, 2వ వార్డు అధ్యక్షులు ఏర్పులా రవికుమార్, సాయికుమార్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.