కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి

Published: Tuesday January 03, 2023

ఇబ్రహీంపట్నం, జనవరి 02(ప్రజా పాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ మరియు గోధుర్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయాము అయిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి మందిరం భక్తులతో కిటికిటలాడింది. తెల్లవారు నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరిగింది భక్తజనులకి సోమవారం
ఉదయం 5 గంటలకి స్వామివారి ఉత్తరద్వార దర్శనాలను ప్రారంభించారు. దేవాలయ కమిటీ సభ్యులు విశృతంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను శ్రస్వామి వారి దర్శనము చేసుకున్నారు. ఆలయం భక్తజనసంద్రంగా మారింది.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ జజల భీమేశ్వరి, గ్రామ సర్పంచ్ సోమ ప్రభాకర్, దొంతుల శ్యామల తుక్కారం ఎంపిటిసి పొనకంటి వెంకటి ఉప సర్పంచ్ నల్ల తిరుపతి, గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులు బూరం సంజీవ్, దోమకొండ చిన్న రాజన్న, ఆలయ అర్చకులు మధుర అన్వేషచార్యులు దివాకర్ చార్యులు  లక్ష్మణ చారి భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.