అనాధ ఆశ్రమానికి దుప్పట్లు పంపిణీ చేసిన మధిర టు వీలర్ మెకానిక్ యూనియన్

Published: Wednesday October 06, 2021

మధిర, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ఆకలితో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మధిర రెస్క్యూ టీంవారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి.. మధిర పట్టణ టు వీలర్ మెకానిక్ యూనియన్.. వారు ఆశ్రమంలో వృద్ధులకు టవల్స్ లుంగీలు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధిర టౌన్ ఎస్ఐ సతీష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ పేదలకు వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దోర్నాల రామకృష్ణ చేసే సేవ చాలా అమూల్యమైనది అని.. అభినందించి శాలువాతో సత్కరించారు. మధిర టూవీలర్ మెకానిక్ యూనియన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో మెకానిక్ యూనియన్ అధ్యక్షులు సాంబిరెడ్డి  గౌరవ అధ్యక్షులు ఎస్ కె షాకుర్. ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు అలీ పాషా. టౌన్ సెక్రెటరీ శ్రీనివాసాచారి. ప్రచార కార్యదర్శి నాయక్ సీనియర్ మెకానిక్ యూనిస్. జోసెఫ్ బాజీ తదితరులు పాల్గొన్నారు.