ఎర్రుపాలెం మండలం గట్ల గౌరవరం పంచాయితీ అభివృద్ధికి నోచుకోని పంచాయితీ

Published: Thursday September 30, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని గట్ల గౌరవరం పంచాయతీ నందు గల సత్యనారాయణ పురం గ్రామంలో స్మశాన వాటిక కి వెళ్లడానికి ఇప్పటికీ దారే లేదు. కారణం ఊరు బయట ఉండటం, ఊరు బయట రోడ్డు బాగోక పోవడం దీని సమస్య. గ్రామం నుంచి స్మశాన వాటిక కు వెళ్లే టువంటి రహదారి బాగాలేదని, అక్కడికి వెళ్లడానికి ఎన్నెస్పీ కెనాల్ దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో మంది అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గ్రామ సర్పంచ్ వెర్రి వెంకట్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా చనిపోతే చాలా బాధ పడుతున్నా మని, వర్షం పడితే ఇంకా చాలా ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామం ఆంధ్రాకి సరిహద్దుగా ఉన్నందున గ్రామానికి నిధులు లేక తంటాలు పడాల్సి వస్తోంది అని పేర్కొన్నారు. వర్షం పడిన రోజు ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళటం ఎంత ఇబ్బందిగా ఉందో అని చెప్పారు. ఎన్ఎస్పి కెనాల్ నీరు వస్తు నందు వలన కెనాల్ దాటి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పంచ్ వెంకట్రావు ప్రభుత్వం రోడ్డు వేయ అక్కర్లేదు, కానీ స్మశాన వాటిక దగ్గరకు వెళ్ళుటకు కనీసం ఒక మూడు మీటర్ల రహదారిని వేయమని కోరుతున్నాడు. ఎంతో మంది అధికారులు వచ్చినా గ్రామం గురించి పట్టించుకోవడం లేదు అని చెప్పారు. అన్ని గ్రామాలకు సరిపడా నిధులు ఇచ్చారు, కానీ మా గ్రామ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు.