కబ్జా కోరల్లో గచ్చిబౌలి గ్రామ స్మశాన వాటిక

Published: Tuesday January 25, 2022
కబ్జాకోరులు పరం కాకుండా కాపాడి తీరుతాం రవి కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 22) : గచ్చిబౌలి గ్రామ, సర్వే నెంబర్ 136లో జరుగుతున్న భూకబ్జాలు గురించి శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్ దృష్టికి తెలియజేయడంతో వెంటనే కుమార్ యాదవ్ కబ్జాకు గురైన స్థలం కు చేరుకొని పరిశీలించగా ఎనిమిది ఎకరాల స్థలం మాజీ ఎమ్మెల్యే బిక్షపతి ముస్లింలకు, ఎస్సీలకు స్మశాన వాటికలను వారికి కేటాయించడం జరిగింది, వారి దగ్గర కేటాయించినటువంటి లీగల్ డాకుమెంట్స్ అన్ని ఉన్నప్పటికీ స్మశానవాటిక లకు పూర్తిగా ఫెన్సింగ్ కూడా వేసి ఉంది, ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఫెన్సింగ్ ను కూల్చేసి కబ్జా చేయడం జరిగింది, అలాగే అక్కడ ఉన్న కంకర గుంట అనే భావి ని కూడా పూర్తిగా మట్టితో పూడ్చేసి చేసి అమ్ముకోడానికి టిఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండలు, తెలంగాణ ప్రభుత్వ అండదండలు తీసుకొని కబ్జాకోరులు ప్రభుత్వ స్థలాన్ని కాజేయలని చూస్తున్నారుఅని స్మశాన వాటిక ను కూడా కబ్జా చేస్తున్న తెరాస పార్టీ పద్దతి చూస్తుంటే సిగ్గు వస్తుందని ఆయన అన్నారు, పక్కనే ఉన్నా గచ్చిబౌలి విలేజ్ స్థలాన్ని కూడా కబ్జా చేయటం జరిగిందని ఈ విషయం అందరికి తెలిసిందే అప్పటికీ స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు పోయిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, తెరాస పాలనలో కబ్జాదారుల దోపిడీదారులు ఎక్కువ అయిపోయారు టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు, అధికారులు కూడా ఏమి పట్టనట్లు వ్యవహరించటం దుర్మార్గపు చర్య, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, స్మశాన వాటిక ను కాపాడే నిజంగా కార్యచరణ మొదలుపెడతామని దీనిమీద అ రేపు వెంటనే మండల రెవెన్యూ అధికారులును కలిసి, మాట్లాడి తక్షణమే తగు చర్యలు తీసుకునేలా బాధ్యత తీసుకుంటామని స్మశాన వాటిక ను ఎస్సీలకు చెందేలా గచ్చిబౌలి విలేజ్ ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.