కరోనాని కట్టడి చేయాలంటే ప్రజలందరూ ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌కి సహకరించాలి : సైబరాబాద్ సీ.పీ సజ

Published: Thursday May 13, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా వైరస్ వ్యాప్తి రెండవ వేవ్ అత్యంత ప్రమాదకరంగా తయారైందని, మొదటి వేవ్ కు రెండవ వేవ్ కు చాలా తేడా ఉందని, ప్రజల్లో ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతూ మొత్తం కుటుంబాన్ని కరోనా బారిన పడేలా చేస్తుందని, అందుకే ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని, కరోనాని లాక్ డౌన్ చేయాలంటే, ప్రజలందరూ ఇంట్లోనే ఉండి లాక్‌డౌన్‌కి సహకరించాలని అప్పుడే కరోనా పై విజయం సాధిస్తామని సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ తెలిపారు. బుధవారం లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి తానే స్వయంగా లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నట్లు సీ.పీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వందకు పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అందులో సీనియర్ పోలీస్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బందోబస్తులో ఉండి లాక్‌డౌన్‌ని నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని మొదటి లాక్ డౌన్ కన్నా, రెండవ లాక్ డౌన్ లో ప్రజల సహకారం బాగుందని, ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని అనవసరంగా ఎవరూ ఆందోళన చెందవద్దని నిత్యవసర వస్తువుల కోసం బయటికి వచ్చినప్పుడు మూడు నాలుగు రోజులకు సరిపడా వస్తువులను ఒకసారి కొనుగోలు చేయాలని సమయం తక్కువగా ఉన్నందున మాటిమాటికి అనవసరంగా బయటికి రాకుండా ఉండాలని ప్రజలకు హితవు చెప్పారు. లాక్ డౌన్ ని కచ్చితంగా కఠినంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఒకే చోట ఉండడం జరిగితే వారి పై కేసులు నమోదు చేయనున్నట్లు సజ్జనార్ తెలిపారు. ప్రజలెవరూ కరోనా సమయంలో బయటకు వచ్చి అనవసరంగా కేసులో ఇరుకోవద్దని వారి పై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. లాక్ డౌన్ అమలు పర్యవేక్షణలో సీ.పి.సజ్జనార్ తో పాటు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.