గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : AISF డిమాండ్

Published: Monday February 14, 2022
మధుర ఫిబ్రవరి 12 ప్రజా ప్రతినిధి : మధిర మండలం ఆదివారం నాడుకృష్ణాపురం గ్రామంలో మహాత్మ జ్యోతిబా పూలే బోనకల్ బాలుర జూనియర్ గురుకులంని AISF మధిర నియోజవర్గ సమితి ఆధ్వర్యంలో గురుకుల ను సందర్శించడం జరిగిందిఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందట్లేదని రాత్రి నిద్రించడానికి బెడ్ లేక రూము సరిపడా లేకపోవడం వల్ల క్లాస్ రూమ్ లోనే నిద్రించ పరిస్థితి ఏర్పడిందని కుళ్లిపోయిన టమాటాలు బంగాళదుంప కుళ్లిపోయి నాసిరకమైన కూరగాయలతో కూరలు వాడటం జరుగుతుందని మెనూ ప్రకారం భోజనం అందించాలని సొంత భవనాలు గురుకులాలు లేకపోవడం వల్ల అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో 400 మంది విద్యార్థులు ఎట్లా ఉండగలరని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మధిర నియోజకవర్గ సమితి నాయకులు మొండితోక లక్ష్మణ్ యం గల ఉజ్వల్ మండల నాయకులు సాయి మణికంఠ గోపి కేంద్ర నరేంద్ర వెంకట్ తదితరులు పాల్గొన్నారు