కౌన్సిలర్ కృషి అభినందనీయం మున్సిపల్ చైర్మెన్ జక్కుల శ్వేత

Published: Wednesday November 30, 2022
బెల్లంపల్లి నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి:  కాల్ టెక్స్ ఏరియాలో  వ్యాపార సముదాయాల ఏర్పాటుకు స్థానిక కౌన్సిలర్  నెల్లి శ్రీలత రమేష్ చేస్తున్న కృషి అభినందనీయమని, బెల్లంపల్లి మున్సిపల్  చైర్మన్ జక్కుల శ్వేత అన్నారు.
సోమవారం స్థానిక 12 వ వార్డ్ కాల్టెక్స్ ఏరియాలో ఎంతో అందంగ ఆధునికరించిన" స్వీట్ "దుకాణాన్ని ఆమె ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ,
బెల్లంపల్లి పట్టణం లోని కాల్ టెక్స్ ప్రాంతంలో నూతనంగా స్వీట్స్ దుకాణం ఏర్పాటు చేయడం అభినందనీయమని, 
 నూతనంగా ఏర్పాటుచేసిన దుకాణంలో అన్ని  రకాల స్వీట్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని,  కాల్ టెక్స్ ప్రాంతంలో రోజు రోజుకు వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయడంలో స్థానిక కౌన్సిలర్ చేస్తున్న కృషి అభినందనీయమని అ న్నారు. ఈ  కార్యక్రమంలో కౌన్సిలర్ నెల్లి శ్రీలత, నాయకులు జక్కుల శ్రీధర్,నెల్లి రమేష్ , టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.