*పెంచిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా వెలువెత్తున నిరసనలు* -సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస

Published: Friday March 03, 2023

చేవెళ్ల మార్చ్ 2, (ప్రజాపాలన):-

బీజేపీ ప్రభుత్వం
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్‌, డీజిల్‌,  గ్యాస్‌ ధరలు నిరంతరం పెంచుతూ పేద. మధ్య తరగతి ప్రజల నడ్డివిరుస్తోండని సిపిఐ జిల్లా కార్యదర్శి  పాలమాకుల జంగయ్య అన్నారు. అంతర్జాతీయంగా చమురు బ్యారెల్‌ ధరలు పెరుగుతున్నాయని సాకు చెబుతున్నది. కాని వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు బ్యారెల్‌ ధరలుతగ్యాయని, కానీ  మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఎందుకు తగ్గడం లేదు. పేద ప్రజలు  వాడే ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే ధనికులు ప్రయాణం చేసే విమానపు ఇంధనం ధరలు తగ్గుతున్నాయి. కావున కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాలకు బాసటగా, పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది రానున్న కాలంలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని  మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ఎం ప్రభు లింగం ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బికే ఎం యు జిల్లా అధ్యక్షుడు అంజయ్య మండల కార్యదర్శి సత్తిరెడ్డి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల విజయమ్మ మీనాక్షి మండల ఏఐటీయూసీ అధ్యక్షుడు శివ  కార్యదర్శి శివయ్య బికేఎంయు మండల కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.