పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించ వద్దు: ఎస్సై మేడా ప్రసాద్

Published: Tuesday February 01, 2022
ఎర్రుపాలెం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: పరిమితికి మించి ఆటోలలో వ్యవసాయ కూలీలను కార్మికులను శూభ కార్యాలకు సంబంధించిన ఏదైనా ఆటోలలో నిబంధనల ప్రకారం పరిమితికి మించి ప్రజలను ఎక్కించు కుంటే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎర్రుపాలెం ఎస్సై మేడా ప్రసాద్ అన్నారు. ఆదివారం ఎస్సై  మేడా ప్రసాద్ మాట్లాడుతూ ఆటో ట్రాలీ నిర్వాహకులు మరియు డ్రైవర్లు ప్రతి ఒక్కరు తప్పకుండా నిబంధనలు పాటించాలి అని, వాహానికి సంబంధించి ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలు సక్రమంగా ఉండాలి అని, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి అలా సరైన పత్రాలు లేకుండా లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఆటో మరియు ఇతర వాహనాలలో ప్రజలను వారి పనుల నిమిత్తం తీసుకెళ్లేటప్పుడు ఆ వాహనం పరిమితికి సరిపోయే విధంగా ప్రజలను ఎక్కించుకోవాలి అలాకాకుండా పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని ప్రయాణికులు తీసుకెళ్తే వారిపై చట్ట పరంగా చర్యలు తప్పవు అన్నారు. ముఖ్యంగా లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనదారుడు వాహనం ఇస్తే వాహన యజమాని పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా ఆటోలలో పరిమితికి మించి ప్రయత్నించవద్దని ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు తిరిగి రావు అన్నారు. ప్రజలు కూడా ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఎవరైనా పరిమితికి మించి ఆటల్లో ప్రజలను తీసుకెళ్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎర్రుపాలెం ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు.