కుల వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం

Published: Thursday September 09, 2021
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజాపాలన : కుల వృత్తుల వారిని ప్రోత్సహించి ఆర్థికంగా ఎదిగేందుకు సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ లో 5వ విడత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్ నిఖిలతో కలిసి  చేపలు వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 వేల చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 89 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉద్ఘాటించారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరుల్లో విడుదల చేశామని వివరించారు. కుల వృత్తుల బలోపేతం చేయటానికి, వారు ఆర్థికంగా ఎదగటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. చేపలు, గొర్రెల పంపిణీతో ఆయా కుల వృత్తుల వారికి అండగా ప్రభుత్వం నిలిచిందని చెప్పారు. గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధార పడే వాళ్ళం, నేడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణలోనే పెరిగిన మత్స్య సంపదని కొనియాడారు. మిషన్ కాకతీయతో చెరువులన్ని జలకళలను సంతరించుకున్న వాటిలో చేప పిల్లలను వదులుతున్నామని వివరించారు. కాళేశ్వరం పూర్తితో దాని కింద ఉన్న చెరువులు నిండి భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయని స్పష్టం చేశారు. 2016వ సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. చెరువులను జియో ట్యాగింగ్ చేయడంతో చేప పిల్లల కౌంటింగ్, నాణ్యత పై నిరంతర పర్యవేక్షణ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఔట్ లెట్ల ఏర్పాటు చేసి తద్వారా తెలంగాణ బ్రాండ్ పేరుతో చేపల విక్రయాలు, చేపల వంటకాలు అందుబాటులో కి వస్తాయని తెలిపారు. తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలలో ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ కు సూచించారు. కోట్ పల్లి లో త్వరలో టూరిజం బోట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బెస్త, ముదిరాజ్, మృత్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఐదేళ్లు గా 208 కోట్ల రూపాయల పై చిలుకు నిధులను ఖర్చు చేస్తే, 30 వేల కోట్ల ఆదాయం రావడం సంతోషించదగిన విషయమన్నారు.15 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి జరిగిందని వివరించారు. జిల్లాలో 447 మందికి కోటి 40 లక్షల రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 51 కోట్ల 80 లక్షలు ఖర్చు చేసి 18,335 నీటి వనరుల్లో 68 కోట్ల 52 లక్షల చేప పిల్లలను వదిలామని స్పష్టం చేశారు. 8 కోట్ల 61 లక్షలు ఖర్చు చేసి 93 నీటి వనరుల్లో 4 కోట్ల రొయ్య పిల్లలను గత ఏడాది చెరువుల్లో వదిలామని ఉద్ఘాటించారు. వికారాబాద్ జిల్లాలో 105 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు వాటిలో 4429 మంది సభ్యులు ఉన్నారని వివరించారు. జిల్లా లో 775 చెరువులు ఉంండడం అభినందనీయమన్నారు. 100 శాతం రాయితీ పై రిజర్వాయర్లు, ప్రాజెక్ట్ లు, చెరువులలో చేప పిల్లలను వదిలే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరం 79.33 లక్షల చేప పిల్లలను ఒక చేప 47 పైసల చొప్పున 34 లక్షల 22 వేలు వెచ్చించి చెరువుల్లో వదలడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత సంవత్సరం కోటి 14 లక్షలు చిన్న సైజ్ చేప పిల్లలు, 25 లక్షల పెద్ద సైజ్ చేప పిల్లలను 775 చెరువుల్లో వదలడం జరుగుతుందన్నారు. కోట్పల్లి లో ఒక లక్ష చేప పిల్లలను వదిలామన్నారు. మరో 9 లక్షల చేప పిల్లలను విడతల వారీగా వదలనున్నామని వివరించారు.
స్కై మెడిసిన్స్ కార్యక్రమం ప్రారంభం : 
 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధియా, రాష్ట్ర మునిసిపల్, ఐ టి పరిశ్రమల శాఖ మంత్రి కే టి ఆర్  ఈ నెల 11న వికారాబాద్ రానుండటం తో ఎస్ పి కార్యాలయ గ్రౌండ్ ను ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్ పి నారాయణలతో కలిసి  పరిశీలించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 11న వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్ ల సహాయం తో పిహెచ్సి లకు మందులు, వాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు. సభా స్థలి, డ్రోన్ లు ఎగిరే ప్రాంతం, మీడియా గ్యాలరీలను పరిశీలించి కలెక్టర్ కు పలు సూచనలు చేసిన మంత్రి. అంతకుముందు అనంతగిరి రోడ్డులోని 100 పడకల ఆస్పత్రిని సందర్శించి, ఆర్టిపిసిఆర్ సెంటర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. దేశ వ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం తో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.