జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు

Published: Monday September 27, 2021
మంచిర్యల బ్యూరో, సెప్టెంబర్ 26, ప్రజాపాలన : వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతిని జిల్లా అంతట ఘనంగా జరుపుకు న్నారు. ఆమె చిత్ర పటాలకు పూలమా లలు వేసి నివాళులర్పించారు. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులోని అమరవీరుల స్థూపం దగ్గర వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐలమ్మ ఆనాటి రజాకార్ల ఆగడాలను అరికట్టడంలో  వీరనారిగా ఆమె చేసిన పోరాటం నేటి మహిళా సమాజానికి స్ఫూర్తిదాయకం అని కోనియాడారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్య అంశాల్లో చేర్చాలని, ఆమె విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్, వైద్య భాస్కర్, ఎడ్ల పున్నం, కార్యదర్శి కీర్తి బిక్షపతి, ప్రచార కార్యదర్శి  నగునూరి లక్ష్మణ్, కార్యనిర్వాహక కార్యదర్శి బద్ది శ్రీను, యువ నాయకులు మాచర్ల సదానందం, సీనియర్ నాయకులు పడాల శ్రీనివాస్, పట్టణ మహిళా నాయకురాలు భీమరి విజయ, పట్టణ కార్యవర్గ సభ్యులు కుదురుపాక రవీందర్, సీనియర్ నాయకులు దూలం రాజేందర్, చింతకింది తిరుపతి, చదువుల వినోద్, ఆర్ ఎందుల రాజేశం, ముచ్చకుర్తి భూమేష్, వెంకటేశ్వర్లు, విజయ భాస్కర్ వేల్పుల సత్యం, శ్రీనివాస్ నీలం శంకర్, దామోదర్, క్రాంతి, సిహెచ్ శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.
జన్నారంలో రజక సంఘం ఆద్వర్యంలో..
వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకల్ని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన్నారం జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, జన్నారం ఎంపీపీ మా దాడి సరోజిని, పొనకల్ సర్పంచి జక్కు భూమేష్, ఉట్నూర్ జడ్పిటిసి చారులత లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్, రజక సంఘం మండల అధ్యక్షులు ముకేరా మల్లేష్, పట్టణ అధ్యక్షులు కొదురుపాక కొమురయ్య, నల్లూరు చందు, నల్లూరి పెద్దన్న, పానగంటి నరేష్, పానుగంటి సత్తన్న, దారాజుల చందు, కొదురుపాక నరేష్ , 
రామకృష్ణాపూర్ లో.....
చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు మంచిర్యాల జిల్లా రామకృష్ణా పూర్ లోని స్థానిక తరాక రామ కాలనీలోని రజక ప్రజా సేవ సంఘము ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం కార్యదర్శి గంగాధరి సతీష్ మాట్లాడుతూ మహారాష్ట్రలో రజకులను ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు.  దళిత బంధు పథకం ఏ విధంగా ఉందో రజకులకు కూడా 10 లక్షల రూపాయలు అందజేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొలిపాక మల్లికార్జున్, ఉపాధ్యక్షులు పైతారు ఓదేలు, సెక్రెటరీ నేరెళ్ల శంకర్, సభ్యులు గంగాధరి చంద్రమోహన్, డబ్బా రమేష్, మినపురం మల్లయ్య, నడిగొట పోశం, శంకర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.