తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరు ఏకమై కరోనాను తరిమికొట్టాలి

Published: Friday June 04, 2021
బాలపూర్, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : మనుషులంతా ఒక్కటే కలిసికట్టుగా ఉన్న మానవత్వంతో కలిగిన డివిజన్ అని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ జన్మదిన ఉత్సవాల సందర్భ భాగంగా, అదేవిధంగా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఓకే రోజు కావడం వల్ల పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని మల్బార్ గోల్డ్ అధినేత సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ చేతుల మీదగా అందజేశారు. అర్జున్ జన్మదినోత్సవ సందర్భంగా శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి, 200 మందికి పారిశుద్ధ్య కార్మికులకు 30 గుడ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులందరు మాట్లాడుతూ... కరోనా మహమ్మారి వైరస్ అంటినే భయపడే ప్రజలు వారిలో సహసంబంధాలు ఉన్న దూరము అవుతున్నారు. కానీ పారిశుద్ధ కార్మికులు పరిసరాల పరిశుభ్రత చేస్తూ, కరొన పాజిటివ్ ఉన్న వారికి మందులు, ఆ వీధిలో శుభ్రపరచడం పిచికారి చేయడం మీ సేవలు మరువలేనివని కొనియాడారు. అదేవిధంగా మనుషులంతా ఒక్కటే అనే భావన కలగాలని, వారు గౌరవ మర్యాదలు  పొందాలంటే వారి  పిల్లలు గొప్ప చదువులు చదివి ఒక లీడర్ గా, హోదా ఉద్యోగంలో ఉండాలని  కావాలని మనస్ఫూర్తిగా కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ గ్రూప్ అధినేత, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డి ఇ అశోక్ రెడ్డి, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ ఐ ఉదయ్ భాస్కర్, ఎస్ ఐ వెంకట్ రెడ్డి, ఎస్ ఐ మారయ్య, కార్పొరేషన్ కార్పొరేటర్లు కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, పెద్ద బాబి ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భీమిడి స్వప్న జంగారెడ్డి, కాలనీ వాసులు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.