పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Published: Friday December 02, 2022

మధిర రూరల్ డిసెంబరు ఒకటి ప్రజా పాలన ప్రతినిధి మండలంలోని గురువారం సిరిపురం, నక్కల గరుబు గ్రామాల్లో గురువారం  రైతులు సాగు చేస్తున్న పత్తి,మిరప పంట పొలాలను వ్యవసాయ శాఖ మరియు నూజివీడు కంపెనీ ఆధ్వర్యంలో పలువురు శాస్త్రవేత్తలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైరా కెవికె శాస్త్రవేత్తలు డాక్టర్ రుక్మిణీదేవి, వేణుగోపాల్, నాగస్వాతి మాట్లాడుతూ పత్తిలో అధిక సాంద్రత విధానంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా రైతులు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని, ఆరుతడి పంటలను వేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సేవా వేణు సర్పంచ్ పెద్ద బుచ్చయ్య వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు నూజివీడు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ రమణారెడ్డి కృష్ణారావు ఏఈఓ సిందూర్ వంశీకృష్ణ కమలహాసన్ నిఖిత రైతులు దుంపా వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.