మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** వజ్రోత్సవంలో భాగంగా హరితహా

Published: Monday August 22, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు21(ప్రజాపాలన, ప్రతినిధి) : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని దానిని బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడవులు మానవ మనుగడకు జీవనాధారమని, జిల్లాలో అడవుల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. హరితహారం లో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం పెంచడంతోపాటు ఆహ్లాదం కోసం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హరితహారం లో భాగంగా పాఠశాల ఆవరణలో 250 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్,డిఎఫ్ఓ దినేష్ కుమార్,రమేష్, ఎంపీడీవో శశికళ, ప్రసాద్,అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.